VIDEO: RTC బస్సు ఢీకొని వృద్ధుడికి గాయాలు
KMM: వైరా ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అధికారులు ప్రైవేటు డ్రైవర్‌తో బస్సును నడిపిస్తుండగా, అజాగ్రత్త కారణంగా ఓ వృద్ధుడిని బస్సు ఢీకొట్టింది. ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. సదరు వృద్ధుడు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.