భారీగా గంజాయి స్వాధీనం

VZM: మానాపురం రైల్వే గేటు సమీపంలో భారీగా గంజాయి పట్టుబడింది. సోమవారం పెదమానాపురం పోలీసులు, ఈగల్ బృందంకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో ఒరిస్సా రాష్ట్రం పొట్టంగి నుండి విశాఖకు తరలిస్తున్న 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.