VIDEO: వేతనాలు చెల్లించాలని కార్మికుల ధర్నా
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మంగళవారం ఉదయం తెలంగాణ మున్సిపల్ కాంటాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. పారిశుద్ధ కార్మికులకు రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.