చెరకు రసంతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
వేసవి కాలంలో శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో చెరకు రసం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సహజసిద్ధమైన గ్లూకోజ్ అలసటను తగ్గించి శరీరాన్ని రీఛార్జ్ చేస్తుంది. చెరకు రసంలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను వేగవంతం చేసే పొటాషియం ఇందులో పుష్కలంగా ఉంటుంది. అయితే, మధుమేహం ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.