విద్యార్థినిని అభినందించిన కళాశాల ప్రిన్సిపల్
BDK: అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎస్.కె అమ్రిన్ ఈనెల 14 నుండి 16 వరకు హైదరాబాదులోని జింఖానా గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్ క్రీడలలో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం, షాట్ పుట్‌లో రజత పతకాన్ని సాధించింది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ నెల్లూరు శేషు బాబు, అధ్యాపకులు ఇవాళ ఆమెను సన్మానించారు.