'డ్వాక్రా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి'
BPT: కర్లపాలెంలో బుధవారం జరిగిన సమావేశంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ మాధురి పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలు గ్రూప్ లోన్లను సకాలంలో చెల్లిస్తూ, చిన్న పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. నిజాయితీగా రుణాలు చెల్లించే వారికి విద్యా, ముద్రా, గృహ రుణాలు కూడా మంజూరు చేస్తామన్నారు. అనంతరం రుణాలు చెల్లించిన ఉత్తమ గ్రూపులను సత్కరించారు.