QR కోడ్ స్కాన్ చేస్తే.. ఇంటి వద్దకే మట్టి విగ్రహం

SKLM: గణేశ్ చతుర్థి వేడుకలు పర్యావరణహితంగా జరగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యావరణహిత గణేశ్ చతుర్థి పోస్టర్‌ను ఆవిష్కరించారు. భక్తి-ప్రకృతి రెండింటినీ కాపాడే బాధ్యత మనందరిదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. QR కోడ్ స్కాన్ చేస్తే ఇంటి వద్దకే మట్టి విగ్రహం పంపిచనున్నట్లు తెలిపారు.