2న అన్ని గ్రామాలలో గ్రామసభలు
KRNL: బండి ఆత్మకూరు మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో బుధవారం గ్రామ సభలు నిర్వహించనున్నామని ఎంపీడీవో వాసుదేవ్ గుప్తా తెలిపారు. 2025-26కు సంబంధించి పనులను గుర్తించుటకు కోసం గ్రామ సభలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గ్రామ సభలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ప్రజలు పాల్గొని గ్రామసభలను విజయవంతం చేయాలన్నారు.