టీడీపీ కార్యకర్తల తిరుమల పాదయాత్ర

ప్రకాశం: కొమరోలు మండలం అక్కపల్లె గ్రామానికి చెందిన రమణ, హరినాథ్ అనే ఇద్దరు టీడీపీ కార్యకర్తలు, 2024 ఎన్నికలలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విజయం సాధిస్తే కాలినడకన తిరుమల వెంకన్నను దర్శించుకుంటామని మొక్కుకున్నారు. ఈ మేరకు ఆదివారం వారు తమ స్వగ్రామం నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. వారి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కార్యకర్తలను అభినందించారు.