VIRAL: మెరీనా బీచ్‌లో అద్భుతమైన మార్పు
చెన్నై మెరీనా బీచ్‌లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు స్మార్ట్ వెండింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. సందర్శకులు వాడేసిన ప్లాస్టిక్ సీసాలను ఈ యంత్రంలో వేస్తే.. బదులుగా పర్యావరణహితమైన సంచులను ఉచితంగా పొందవచ్చు. ప్లాస్టిక్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ పద్ధతి ద్వారా బీచ్ శుభ్రంగా ఉండటమే కాకుండా, ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెరుగుతుంది.