పేదవాడి ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

SKLM: ఒక్క పేదవాడి ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తెలిపారు. మంగళవారం రణస్థలం మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి గాను ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేసి ఎంతోమంది నిరుపేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించారని, నేడు తిరిగి దానిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆయన వివరించారు.