మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా

మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా

SRD: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు CITU ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా నాయకులు మహిపాల్ మాట్లాడుతూ.. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 7వ తేదీలకు కార్మికుల వేతనాలు జమ చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.