కొల్లేరులో పడి వ్యక్తి మృతి

ELR: గేదెలను మేపేందకు వెళ్లిన కాపరి నీట మునిగి మృతి చెందిన ఘటన కొల్లేరులో చోటుచేసుకుంది. పైడి చింతపాడుకు చెందిన రామారావు(38) కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. నిన్న గేదెలు మేపడానికి కొల్లేరు వైపు వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. కుటుంబీకులు రామారావు కోసం వెతకగా సోమవారం ఉదయం కొల్లేరులో శవమై దొరికాడు. ఇతను దివ్యాంగుడు కావడంతో ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు.