'ఎంత కష్టమైనా వస్తాం.. తప్పక ఓటేస్తాం'
GDWL: ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో విలువైనదే. ఒక్కొక్క సారి ఒక్క ఓటు కూడా అభ్యర్థుల భవితవ్యాన్ని డిసైడ్ చేస్తుంటాయి. అయితే కొంత మంది సొంతూర్లో, పక్క గ్రామంలో ఉన్నా, గంటల తరబడి క్యూలో నిలబడి ఓటు వేయ్యలేం బాబాయ్ అని నిర్లప్తతతో ఉంటారు. ఇలాంటి తరుణంలోనే కొంత మంది ప్రయాణం ఎంత దూరమైనా... 'ఎంత కష్టమైనా సొంతూరికి వస్తాం - తప్పకుండా ఓటు వేస్తాం' అంటూ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు.