VIDEO: తొర్రూరులో గోమాతల ఊరేగింపు
MHBD: కనుమ సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని గోశాలలో గోమాతలను శుభ్రపరచి పసుపు, కుంకుమలతో పూజించారు. అనంతరం గోశాల నుంచి మెయిన్ రోడ్డు, బస్టాండ్ మీదుగా నితిన్ ఫౌండేషన్ వరకు భారీ ర్యాలీ నడుమ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు, సభ్యులు పాల్గొన్నారు.