రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని పోలకల రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పొలకల పంచాయతీకి చెందిన గిరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.