VIDEO: 'డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం'

VIDEO: 'డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం'

కర్నూలు జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి వెల్లడించారు. ప్రభుత్వ కంటి ఆసుపత్రి సమీపంలో నిర్మించిన డిప్యూటీ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయం, ప్రాంతీయ ప్రయోగశాల భవనాలను ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, పలువురు అధికారులు ఉన్నారు.