భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు
పార్వతీపురం జిల్లా కేంద్రంలో పవిత్ర శుక్రవారం సందర్భంగా గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. పట్టణంలోని పండా వీధిలో ఉన్న తిరు కుటుంబ దేవాలయం ఫాదర్ సునీల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.సెంట్ పీటర్ పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ ధ్యానయాత్రలో క్రైస్తవులు, దీక్షాపరులు పాల్గొన్నారు. యేసు క్రీస్తు మరణాన్ని స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు.