VIDEO: తుప్పు పడుతున్న ప్రభుత్వ వాహనాలు !
SGR: జిల్లా కలెక్టరేట్ ఆవరణలో లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ వాహనాలు నిరుపయోగంగా మారి తుప్పు పడుతున్నాయి. మరమ్మతులకు గురైన ఈ వాహనాలను షెడ్డులో ఉంచకుండా ఆవరణలో వదిలేయడంతో ఎండకు ఎండి, వానకు తడుస్తూ పాడవుతున్నాయి. అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాలని లేదా బహిరంగ వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చాలని స్థానికులు కోరుతున్నారు.