గజపతినగరం లాడ్జిలో వ్యక్తి మృతి

VZM: గజపతినగరంలోని ఓ లాడ్జిలో వ్యక్తి మరణించిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడు స్థానికంగా దాబాలో పనిచేస్తున్న వంగర మండలం కొక్కిసకు చెందిన వాన అచ్యుతరావుగా గుర్తించారు. లాడ్జిలో అస్వస్థతకు గురవ్వగా స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పెదమానాపురం ఎస్సై జయంతి పరిశీలించారు.