రైల్వే స్టేషన్‌లలో సమస్యలపై ఎంపీ ప్రస్తావన

రైల్వే స్టేషన్‌లలో సమస్యలపై ఎంపీ ప్రస్తావన

VZM: విజయనగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్‌లలో వేచివుండే హాల్, మరుగుదొడ్లు, ఎస్కలేటర్లు, తదితర సదుపాయాలు కల్పించాలని MP అప్పలనాయుడు కోరారు. విశాఖలో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అలాగే కొరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కి హాల్ట్, ప్రతిరోజూ తిరుపతికి రైళ్లు, శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలన్నారు.