VIDEO: 'మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి'

VIDEO: 'మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి'

KMM: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మట్ట రాగమయి అన్నారు. బుధవారం సత్తుపల్లి పట్టణంలో రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలతో నివాళులర్పించారు. భారతదేశానికి ఐటీ రంగాన్ని పరిచయం చేసిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.