అధిక శబ్దం వచ్చే డీజేలకు అనుమతి లేదు: SP

అధిక శబ్దం వచ్చే డీజేలకు అనుమతి లేదు: SP

ADB: అధిక శబ్దం వచ్చే డీజేలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. సోమవారం పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్‌లో గణేష్ ఉత్సవాల సమితి కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐక్యమత్యానికి ప్రతీకగా బాలగంగాధర్ తిలక్ గణపతి ఉత్సవాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. శాంతియుతంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని అఖిల్ మహాజన్ సూచించారు.