'పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

SRD: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతలు అధ్యాపకులు, విద్యార్థులు తీసుకోవాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.