నేడు కార్వేటినగరంలో వైసీపీ నేతల ప్రత్యేక పూజలు
CTR: కార్వేటినగరంలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ ఇంఛార్జ్ కృపాలక్ష్మీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో శనివారం ఉదయం 9.30 గంటలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి నేతలకు సుబుద్ధి ప్రసాదించాలన్నదే పూజల ఉద్దేశం అని వారు తెలిపారు.