'ఓపీఎస్ పెన్షన్ విధానం కొనసాగింపు జరగాలి'

SKLM: శ్రీకాకుళం బాపూజీ కళామందిర్‌లో ఆదివారం పెన్షనర్స్ ఐక్యవేదిక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా CPS ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గురుగుబెల్లి భాస్కరరావు పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగ విరమణ పొందిన వారి యొక్క యోగక్షేమాలు ప్రభుత్వ బాధ్యతగా ఉండటమే సరైన విధానమని అన్నారు. ఓపీఎస్ విధానం భారమని కేంద్ర ప్రభుత్వం అనడం సరికాదన్నారు.