మైనింగ్ వద్దంటూ ఆందోళన.. 40 మందికి గాయాలు
ఛత్తీస్‌గఢ్ సుర్గుజా జిల్లాలో అమెరా ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ విస్తరణను అడ్డుకునేందుకు స్థానిక గిరిజనులు పెద్దఎత్తున తరలివచ్చారు. వీరిని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా.. తీవ్ర హింసకు దారి తీసింది. గిరిజనుల దాడిలో 40 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. ముందుగా పోలీసులు దాడి చేశారని గిరిజనులు చెబుతుండగా.. గిరిపుత్రులే రాళ్లు రువ్వినట్లు అధికారులు తెలిపారు.