పింఛన్‌లను పంపిణీ చేసిన మంత్రి
VZM: గజపతినగరం మండలం జిన్నాంలో లబ్ధిదారులకు పింఛన్‌లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ సమయానికి పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, కొండపల్లి భాస్కరనాయుడు పాల్గొన్నారు.