రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం: ఎంపీ

రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం: ఎంపీ

RR: చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రూ.5 లక్షలతో పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ.. అడిగిన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు.