హిట్ టీవీ కథనానికి స్పందన
NRML: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతపై హిట్ టీవీలో వార్త ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పందించారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బుక్ చేసిన సిలిండర్లు నిర్ణీత గడువులో డోర్ డెలివరీ అవుతాయని చెప్పారు. గ్యాస్ కోసం ఏజెన్సీలకు వెళ్లాల్సిన అవసరం లేదని, కొరతపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని సూచించారు.