ఆదోనిలో నాటుసారా స్థావరాలపై దాడులు

ఆదోనిలో నాటుసారా స్థావరాలపై దాడులు

కర్నూలు: ఆదోనిలోని బాలనాగన్న చెరువుకు సమీపంలో నాటుసారా స్థావరాలపై దాడులు జరిపి 1000 లీటర్ల నాటుసారా ఊటను, నాటుసారా తయారు చేసే సామగ్రిని పోలీసులు ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో టూటౌన్ సీఐ గోపి, వన్ టౌన్ సీఐ తేజోమూర్తి, ఎస్సై లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.