విశాఖకు మరో ఐటీ కంపెనీ
విశాఖలో కాగ్నిజెంట్ కార్యకలాపాలకు సిద్దమవుతుంది. ఈ నెల 12న కాపులుప్పాడలో 22.19 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవనాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఏపీఐఐసీ రుషికొండ ఐటీ సెజ్ లోని మహతి బిల్డింగ్‌లో తాత్కాలిక క్యాంపస్ నిర్వహణకు సన్నద్ధం చేస్తున్నారు. రూ. 1600 కోట్ల పెట్టుబడులతో 2029 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.