దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

MDK: నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదు నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించబోయే క్రమంలో అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న టీ కొట్టు, కిరాణా దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా బైక్ ధ్వంసం అయింది. పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.