బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

NLG: నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి తెలిపారు. గురువారం పైలాన్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని నియోజకవర్గానికి తీసుకువస్తామన్నారు.