ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

SRPT: నూతనకల్ మండల పరిధిలోని మిర్యాల గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అనంతుల శ్రీనివాస్ ఇవాళ గ్రామంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు.​ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలను కోరారు.