హత్య కేసులో తండ్రి, కుమార్తెకు జీవిత ఖైదు

హత్య కేసులో తండ్రి, కుమార్తెకు జీవిత ఖైదు

KDP: జమ్మలమడుగులోని నాగులకట్ట వీధికి చెందిన మాధవి(32) బీసీ కాలనీకి చెందిన మునగాల రవి(35) వద్ద రూ.5 లక్షలు అప్పు తీసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని రవి అడగడంతో మాధవి అతడిపై కక్ష పెంచుకుని, 2017 జనవరి 19న తన తండ్రి సూర్యనారాయణ రెడ్డి(65)తో కలిసి రవిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేశారు. అయితే నేరం నిరూపితమవడంతో కోర్టు మాధవికి, సూర్యనారాయణ రెడ్డికి జీవిత ఖైదు శిక్ష విధించింది.