అవుకు వద్ద పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
NDL: అవుకు పట్టణ సమీపంలోని ఉప్పలపాడు క్రాస్ వద్ద ఇవాళ కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. కారు డ్రైవర్ అతివేగమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పొలాల్లోకి దూసుకెళ్లిన కారణం పరిశీలించారు. స్థానికులు క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు.