బద్వేలు, మైదుకూరు రోడ్డులో కారు-బస్సు ఢీ

KDP: చాగలమర్రి నుంచి వస్తున్న కారు బద్వేల్ నుంచి మైదుకూరుకు వెళ్తున్న బస్సు ఢీకొన్నాయి. శుక్రవారం ఉదయం పుల్లయ్య సత్రం బ్రిడ్జి క్రాస్ వద్ద మలుపును గమనించకుండా వాహనాలు రావడమే కారణంగా తెలుస్తుంది. అయితే ప్రమాదంలో ఎవరికి ఏమి కాలేదని స్థానికులు తెలిపారు. చాగలమర్రి నుంచి అద్దె కారులో నెల్లూరు ఆస్పత్రికి వస్తున్నట్లు సమాచారం.