వర్షాలకు రోడ్లు ధ్వంసం.. నష్టం ఎంతంటే ?

వర్షాలకు రోడ్లు ధ్వంసం.. నష్టం ఎంతంటే ?

కృష్ణా: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. R&B అధికారుల అంచనాల మేరకు.. మొత్తం 333.32 కి.మీ మేర రోడ్లు పాడయ్యాయి. 14 రోడ్లు పూర్తిగా కొట్టుకుపోగా, ఒక రోడ్డు బాగా దెబ్బతింది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ. 33.09 కోట్లు, శాశ్వత పరిష్కారానికి రూ. 251.38 కోట్లు అవసరం కానున్నాయి.