చీప్ లిక్కర్ తాగట్లేనన్నా..!
MDK: ఎన్నికలు రావడంతో మెదక్ జిల్లాలో మద్యం ప్రియులు జాగ్రత్తలు పడుతున్నారు. నిత్యం సారా, చీప్ లిక్కర్ తాగి జేబులు ఖాళీ చేసుకున్న వాళ్లు ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారు. 'అన్నా ఆరోగ్యం బాగుండట్లేదు. డాక్టర్ చీప్ లిక్కర్ తాగొద్దన్నారు' అంటూ పెద్ద మందుకు టెండర్ పెడుతుండటంతో పోటీదారులు ఖంగు తింటున్నారు. నిన్నటి వరకు ఏదో ఒకటి తాగిన వాళ్లు ఇప్పుడు కొత్త బ్రాండ్లు కోరుకుంటున్నారు.