VIDEO: MGM ఆసుపత్రిలో రోగి అదృశ్యం
WGL: MGM ఆసుపత్రిలో రోగి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. CI కరుణాకర్ వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట(M)చెందిన రాజయ్య ఇటీవల అనారోగ్యానికి గురై MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నిన్న వైద్య పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు వెళ్లి, మళ్లీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి CI దర్యాప్తు చేపట్టారు.