ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ హాకీ జట్టు

ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ హాకీ జట్టు

మలేషియాలో జరుగుతున్న సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో భారత హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో 14-3 గోల్స్ తేడాతో కెనడాను చిత్తు చేసింది. దీంతో రేపు జరిగే ఫైనల్‌లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది. కాగా, టీమిండియా ఈ టోర్నమెంట్ చరిత్రలో రికార్డు స్థాయిలో 9 సార్లు ఫైనల్‌కు చేరుకొని, 5 సార్లు విజేతగా నిలిచింది.