ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య

ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య

మార్కాపురం పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో స్థానిక చక్రపాణి బజార్‌లోని ఇండో ఫ్యాక్టరీ వెనుక ఉన్న ఓ ఇంట్లో మల్లికార్జునరెడ్డి అనే యువకుడు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.