నిర్మాణ పనులు నాణ్యతగా జరిగేలా చూడాలి: ఎమ్మెల్యే
ప్రకాశం: హనుమంతుని పాడులో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న తరగతి గదుల భవనాలను పరిశీలించారు. పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.