పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

KDP: అసాంఘిక కార్యకలాపాలు, మహిళలపై దాడులు, ఈవ్ టీజింగ్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ సిబ్బందికి సూచించారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. రానున్న పంచాయితీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.