జోరుగా కొనసాగుతున్న గొర్రెల సంత
వరంగల్: నర్సంపేట పట్టణ పరిధిలో దసరా పండుగ పురస్కరించుకుని వివిధ గ్రామాల ప్రజలు ఉదయం 10 నుంచి నర్సంపేట సంత వచ్చి గొర్రెల కొనుగోలు చేస్తున్నారు. పండగగకు మూడు రోజులు గడువు మాత్రమే ఉండడంతో గొర్రెలకు అధిక ధరలు చెబుతున్నట్లు ప్రజలు తెలిపారు. దీంతో అంగడి ఆవరణం మొత్తం రద్దీగా మారడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు .