VIDEO: కలెక్టర్ గారూ.. మీరైనా న్యాయం చేయండి..!
KRNL: ఆస్పరి మండలం శంకరబండకు చెందిన కుందనగుర్తి రాజు ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్నారు. గొంతు నుంచి మాటలు రాక విగతజీవిగా పడి ఉన్నాడని ఆయన సోదరుడు సోము, భార్య సోమేశ్వరి తెలిపారు. ప్రమాదం జరిగి మూడేళ్లెనా మండల, సచివాలయ అధికారులు పట్టించుకోవడం లేదని, సదరం క్యాంపులో దరఖాస్తు సమర్పించినా నేటికీ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వలేదని వారు ఆరోపించారు.