ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మార్వో
NLG: శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మార్వో వరప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా, కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ధరను పొందాలని కోరారు. రైతులు ధాన్యాన్ని తేమశాతం లేకుండా కేంద్రానికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.