సత్తెమ్మ తల్లి ఆలయంలో దొంగతనం

సత్తెమ్మ తల్లి ఆలయంలో దొంగతనం

AKP: అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామంలో గల సత్తెమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలో ప్రవేశించి హుండీ తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్లారని గ్రామస్తులు తెలిపారు. శనివారం ఉదయం చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల నుంచి హుండీని తెరవలేదన్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు.