'రైతులు అధైర్య పడవద్దు'
ELR: ముదినేపల్లి మండలం బొమ్మినంపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గతంలో మొలకొచ్చిన బియ్యం కొని రైతుకు నష్టం కలగకుండా చూసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు.